
సీనియర్ హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆగ్రహం,నిర్మల్ న్యాయవాది పి. అనిల్ కుమార్ పై పోలీసుల దాడి ఖండిస్తూ
హైదరాబాద్, నవంబర్ 12: శ్రీరామ్ చక్రీ న్యూస్
నిర్మల్ జిల్లా కోర్టు పరిధిలో న్యాయవాది పి. అనిల్ కుమార్‌పై జరిగిన దాడి ఘటనపై హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
మాట్లాడిన ఆయన, ఈ దాడిలో పాల్గొన్న సిఐ మరియు ఇద్దరు ఎస్ఐలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి హానికరమని, ఇటువంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో అడ్వకేట్లు లలితా, సీహెచ్ కమలి కిషోర్, లక్ష్మణ్, శ్రావణ్, వరప్రసాద్, విజయ్, కార్తీక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
