డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్‌ను ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన రగులుతున్న అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డేవిడ్ పాల్-మేరి దంపతులు తన సొంత నిధులతో మంగళవారం సింగరేణి గ్రామపంచాయతీకి వితరణగా అందజేశారు.

కారేపల్లి,డిసెంబర్ 30 : గ్రామపంచాయతీ ప్రజల అవసరార్థం, మరణించిన వారి కోసం డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్‌ను ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన రగులుతున్న అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డేవిడ్ పాల్-మేరి దంపతులు తన సొంత నిధులతో మంగళవారం సింగరేణి గ్రామపంచాయతీకి వితరణగా అందజేశారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ తో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు డేవిడ్ పాల్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పలువురు మాట్లాడుతూ దాత డేవిడ్ పాల్ ను అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత మంది ముందుకు వచ్చి పేద ప్రజల అవసరాలు తీర్చడానికి దోహదపడే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
