పంచాయతీ అభివృద్ధికి సమన్వయం తో పని చేయాలని సర్పంచ్ బానోత్ కావేరి అన్నారు.

నార్నూర్ : పంచాయతీ అభివృద్ధికి సమన్వయం తో పని చేయాలని సర్పంచ్ బానోత్ కావేరి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. వార్డుల వారీగా సమస్యలు వార్డు సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులపై తీర్మానించారు.
