
మహేశ్వరం నియోజకవర్గం, కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి శివరంజని శ్రీకాంత్ గారు, గ్రామస్తులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా, 100 మందికి పైగా గ్రామస్తులు, సభ్యులు ఘనంగా బిఆర్ఎస్ పార్టీలో చేరిక నిర్వహించారు.
శివరంజని శ్రీకాంత్ గారు మాట్లాడుతూ:
“గ్రామం మొత్తం ఒకే తాటిపై నిలిపి, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అగర్మియాగూడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
–
