
డిసెంబర్ 28 (శ్రీరామ్ చక్రి న్యూస్) బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి కాలనీలో నెలకొన్న సమస్యలపై పర్యటన నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న పలు మౌలిక వసతుల సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, రోడ్ల దుస్థితి, వీధి దీపాల కొరత వంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కాలనీ సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకుని, అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ టీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కాలనీవాసులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ చారి, వైస్ ప్రెసిడెంట్ జానారెడ్డి, సెక్రటరీ ప్రసాద్, ట్రెజరర్ జవారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆలేటి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
