తెలంగాణలో మహిళా పోలీసుల అధికారులు బాగా పనిచేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు 2025 వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతలు కూడా శాంతి భద్రతలు కాపీ ఎలక్షన్స్ అన్ని నిష్పక్షపాతంగా జరిగేలా కాపాడామని డీజీపీ అన్నారు.
