వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే ఉత్తర ద్వారాన్ని తెరిచారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వేములవాడలో రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమన్న గుడిలో ఉత్తర ద్వార దర్శనాలు నిర్వహించారు..
