కాంగ్రెస్ సర్కార్‌కు నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల సర్దుబాటులో ఈ వెంచర్ కీలకంగా మారింది. దీంతోపాటు హెచ్ఎండీఏ ప్రతిపాదిత ప్రాజెక్టులకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి ఉండగా.. కోకాపేట్‌లోని నియోపోలిస్, గోల్డెన్ మైల్ లే అవుట్ ప్రాజెక్టుల్లోని ఏడు ప్లాట్ల ద్వారా వచ్చే రెవెన్యూ అభివృద్ధి పనుల్లో పురోగతికి ముఖ్య భూమికను పోషించనుంది.

కాసులు కురిపించిన కోకాపేట్ భూములపై ఇప్పుడు హెచ్ఎండీఏ గంపెడాశలు పెట్టుకున్నది. కాంగ్రెస్ సర్కార్‌కు నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల సర్దుబాటులో ఈ వెంచర్ కీలకంగా మారింది. దీంతోపాటు హెచ్ఎండీఏ ప్రతిపాదిత ప్రాజెక్టులకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి ఉండగా.. కోకాపేట్‌లోని నియోపోలిస్, గోల్డెన్ మైల్ లే అవుట్ ప్రాజెక్టుల్లోని ఏడు ప్లాట్ల ద్వారా వచ్చే రెవెన్యూ అభివృద్ధి పనుల్లో పురోగతికి ముఖ్య భూమికను పోషించనుంది. దీంతో ఈనెల నవంబర్ 24, 25 తేదీల్లో ఆన్లైన్ వేదికగా వేలానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోపోలిస్‌లోని ప్లాట్లకు ఎకరానికి రూ.99కోట్లు ధర నిర్ణయించగా, గోల్డెన్ మైల్ ప్రాజెక్టులో ఎకరానికి రూ.70 కోట్లుగా నిర్ధారించారు.
