చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు.

హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30 : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు. మహానివేదన నీరాజనా మంత్రపుష్పాల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఏడాదికి 24 ఏకాదశలు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందువచ్చే పుష్పశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు
