హైదరాబాద్ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంస్థ కావడం విశేషం.

| హైదరాబాద్ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంస్థ కావడం విశేషం. ఈ సందర్భంగా స్కైరూట్ బృందానికి ప్రధాని అభినందనలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ అంతరిక్షంలో ఇది మైలురాయిగా పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అని, భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
