వేగంగా ప్రయాణిస్తున్న భారీ విద్యుత్తు లారీకి వైర్‌లెస్‌గా ఛార్జింగ్ చేయడంలో అమెరికన్ ఇంజినీర్లు విజయం సాధించారు.

వాషింగ్టన్ : వేగంగా ప్రయాణిస్తున్న భారీ విద్యుత్తు లారీకి వైర్‌లెస్‌గా ఛార్జింగ్ చేయడంలో అమెరికన్ ఇంజినీర్లు విజయం సాధించారు. వెస్ట్ లాఫాయెట్టె, ఇండియానాలోని యూఎస్ హైవే 52/231లోని 400 మీటర్ల భాగంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ రోడ్డు కాంక్రీట్ కింద డైనమిక్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ సిస్టమ్‌ను పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు అమర్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన కమిన్స్ క్లాస్ 8 ఎలక్ట్రిక్ సెమీ ట్రాక్టర్‌ను ఈ రోడ్డుపై నడిపించారు. ఈ వాహనం గంటకు 65 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుండగా, దీని బ్యాటరీలోకి 190 కిలోవాట్ల విద్యుత్తు ఛార్జింగ్ అయింది.
