మహారాష్ట్రలో పత్తిని వ్యాపారులు, దళారులు తక్కువ ధర కొని.. అక్రమంగా మన రాష్ట్రానికి తరలించి ఇక్కడి సీసీఐ కేంద్రాల్లో అధిక ధరకు విక్రయిస్తూ జోరుగా దందా సాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మహారాష్ట్రలో పత్తి ధర ప్రైవేట్‌గా రూ.6000 నుంచి 6500 వరకు దళారులు, వ్యాపారులు కొనుగోలు చేసి సరిహద్దుల్లో తెలంగాణ జిల్లాలకు తరలిస్తున్నారు. ఇక్కడి సీసీఐ కేంద్రాల్లో కనీస మద్దతు ధర రూ. 8100 విక్రయిస్తూ దందా జోరుగా సాగిస్తున్నారు. ఇక్కడ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా ఈ దందా సాగుతుండడం గమనార్హం. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
