ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు కూడా 2 వేలకుపైగా విమానాలను నడిపినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

గత ఐదు రోజులుగా తమ కార్యకలాపాలు నిలకడగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సవరించిన షెడ్యూల్ ప్రకారం రోజుకు 2 వేలకుపైగా విమానాలను నడుపుతున్నామని ఇండిగో తెలిపింది.
డిసెంబర్ 12న 2,050కి పైగా విమానాలను ఆపరేట్ చేయగా కేవలం రెండు సర్వీసులు మాత్రమే సాంకేతిక కారణాలతో రద్దయ్యాయని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 13న కూడా 2,050కి పైగా విమానాలు నడుపాలన్నా అంచనాలకు ఇండిగో చేరువైంది. కార్యకలాపాలలో వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించడానికి ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్సీ’ అనే స్వతంత్ర కన్సల్టెన్సీని నియమించినట్లు సంస్థ వెల్లడించింది.
