మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక్సాకాలో ఇంటర్ఓషియానిక్ ప్యాసింజర్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది.

సుమారు 250 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో ఆదివారం బయల్దేరిన రైలు.. సమీపంలోని నిజాండా వద్ద పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పిందని సమాచారం అందుకున్న మెక్సికన్ ఆర్మీ, సివిల్ ప్రొటెక్షన్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీశారు. వారిలో 139 మంది సురక్షితంగా బయటపడ్డారని, 98 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
