మూసీ ప్రక్షాళనతో నిరుపేదల బతుకులు చితికిపోవద్దని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. అసలు మూసీ ప్రక్షాళన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారని ప్రశ్నించారు

రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసీ ప్రక్షాళనపై జరిగిన చర్చలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన వికారాబాద్ నుంచి చేస్తారా? మధ్యలో నుంచి చేస్తారా అని ప్రశ్నించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉందని అడిగారు. ప్రపంచంలో కాలుష్యంలో మూసీ 8వ స్థానంలో ఉందని తెలిపారు.
