
ఈరోజు,(శ్రీరామ్ చక్రి న్యూస్ ) మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు వద్ద, పండుగ సాయన్న వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మీర్ పేట్ మున్సిపల్ ముదిరాజ్ మహాసభ సంఘం మరియు మీర్పేట్ మున్సిపల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, సంఘం అధ్యక్షులు పులకరం శివశంకర్ ముదిరాజ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

కార్యక్రమంలో నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ, పండుగ సాయన్న సేవలను స్మరించుకుంటూ ఆయన సమాజానికి అందించిన సేవలను అందరూ ఘనంగా గుర్తుచేసుకున్నారు.స్థానిక ముదిరాజ్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ ఐక్యత, సేవా భావం, మరియు సంస్కృతిని ప్రదర్శించిన ఈ వర్ధంతి కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ఈ వేడుకకు ముఖ్యఅతిథులుగాపాల్గొన్నవారూ,రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ ముదిరాజ్,రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మరబోయిన యాదగిరి ముదిరాజ్,మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు చింతల రాఘవేంద్ర ముదిరాజ్,మాజీ కార్పొరేటర్ లక్ష్మణ్ ముదిరాజ్ ,జిల్లెలగూడ కోశాధికారి తులసి ముఖేష్ ముదిరాజ్,జిల్లెలగూడ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్,కోశాధికారి ఆంజనేయులు ముదిరాజ్,అలాగే మీర్పేట్ కార్పొరేషన్ నాయకులు మేకల కృష్ణ ముదిరాజ్, లింగస్వామి ముదిరాజ్, రాజేంద్ర ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, సాయం వెంకటేష్ ముదిరాజ్, అంజన్ కుమార్ ముదిరాజ్, శ్రీను ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
