
మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని RVR కాలనీ, అల్మాస్ గూడాలో ఉన్న శ్రీ హరి హర పుత్ర గోశాలలో ఒక ఆధ్యాత్మిక ఘట్టం చోటుచేసుకుంది.
రమేష్ గురుస్వామి, అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకొని శబరిమలై యాత్రకు బయలుదేరారు.
ఈ సందర్భంగా గోశాలలోనే అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం మీడియాతో మాట్లాడిన రమేష్ గురుస్వామి…”గోశాలలో అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకోవడం వల్ల, ఆ గోవు యొక్క అనుగ్రహం మనపై ఉంటూ, సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పక ప్రాప్తిస్తుంది” అని తెలిపారు.”గోవును మించిన దైవం ఎక్కడా లేదు. గోశాలే ప్రత్యక్ష దైవసన్నిధి. ఇక్కడ ఇరుముడి కట్టుకుంటే ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది” అని పేర్కొన్నారు.
గోమాత ఆశీర్వాదంతో, అయ్యప్ప స్వామి నామస్మరణతో శబరిమలై యాత్రకు బయలుదేరిన ఈ దృశ్యం, అక్కడున్న భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఈ కార్యక్రమం ద్వారా గోశాల ప్రాముఖ్యత, గోవు మహత్యం, అయ్యప్ప స్వామి భక్తి తత్వం మరోసారి ప్రజలకు స్పష్టంగా చాటబడింది.
