
జనవరి(1-1-2026) (శ్రీరామ్ చక్రి న్యూస్),మహేశ్వరం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర తొలి విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ప్రచురించిన 2026 క్యాలెండర్ను మెడం గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ మండలం మాజీ MPP జిల్లెలకృష్ణరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, దోమలపల్లి ధనలక్ష్మి, రాజ్ కుమార్, కర్మన్ ఘాట్ టెంపుల్ మాజీ డైరెక్టర్ మేకల యాదగిరి, కాంటెస్టెడ్ కార్పొరేటర్ దయానంద్ ముదిరాజ్, BRS పార్టీ సీనియర్ నాయకులు దండు మహెందర్, దుంపల ప్రభాకర్, కృష్ణ యాదవ్, చందు, శివ లక్ష్మన్ పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షల కార్యక్రమం సుసంపన్నంగా, సానుకూల వాతావరణంలో ముగిసింది.
