
మహేశ్వరం, రామకృష్ణాపురం డివిజన్, ఎన్టీఆర్ నగర్:
యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీ సీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి గారు ప్రత్యేక అతిథిగా హాజరై అక్బర్ గారిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు దంతోజు నరసింహ చారి, కళ్యాణ్, నబి, వెంకటేష్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
