
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌రెడ్డి కి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్లలో ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. దేవాదాయశాఖకు చెందిన రూ.71కోట్ల టెండర్‌ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు కొండా సురేఖ.
