హైదరాబాద్లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వెంబడించి మరీ కత్తులు, తుపాకులతో కాల్చి చంపేశారు.

హైదరాబాద్, డిసెంబర్ 8: నగరంలో ఓ వ్యక్తిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాచకొండ కమిషనరేట్ జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైంది రియల్టర్ వ్యాపారి వెంకటరత్నంగా పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే వ్యాపారిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. వెంకట రత్నం బైక్పై వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతడిని మరో బైక్పై వెంబడించారు. అదును చూసి అతడిపై కిరాతకంగా దాడి చేశారు. సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో నడిరోడ్డుపైనే వ్యాపారిని దారుణంగా హత్య చేశారు.
