బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదు..? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

బనకచర్ల ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ అప్రైజల్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశారు. 20 రోజుల కింద సీఆర్ పాటిల్ ఈ లేఖ రాసినా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు. మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు, రాజ్యాంగం పరంగా వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ జరగదు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ వరద జలాల మీద బనకచర్ల డీపీఆర్ అప్రైజల్ సబ్మిట్ చేసింది.. దీనిపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ రాశారు. మరి రేవంత్ రెడ్డి వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ సాధ్యం కాదని నిలదీయాలి..
