ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇండోర్‌స్టేడియం, ల్యాండ్రోమార్ట్తోపాటు మ్యూజికల్ గార్డెన్‌ను ప్రైవేటీకరణ చేసే దిశగా బల్దియా పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. దీంతో మహా నగరంలో కాలక్షేపం కోసం కుటుంబంతో సహా మ్యూజికల్ గార్డెన్, భద్రకాళీ బండ్‌కు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.

మహా నగరంలో కాలక్షేపం కోసం కుటుంబంతో సహా మ్యూజికల్ గార్డెన్, భద్రకాళీ బండ్‌కు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇండోర్‌స్టేడియంలో ఎంతో మంది క్రీడాకారులు శిక్షణ పొంది జాతీయస్థాయికి ఎదిగారు. కోట్ల నిధులు వెచ్చించి పునరుద్ధరిస్తున్న మ్యూజికల్ గార్డెన్‌ను సైతం ప్రైవేటీకరణ చేయనున్నారు. సుమారు రూ. 2 కోట్ల నిధులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రజకులకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ల్యాండ్రోమార్ట్ను నిర్మించింది. దాని నిర్వహణ బాధ్యతలు రజక సంఘాలకు అప్పగించకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు అడుగులు వేస్తున్నది.
