ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ జోర్డాన్ మ్యూజియాన్ని సందర్శించారు.

సోమవారం సాయంత్రం అమ్మాన్ కు చేరుకున్నారు. అమ్మాన్ విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ జోర్డాన్ మ్యూజియాన్ని సందర్శించారు.
ఆ దేశ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా-2 స్వయంగా కారు నడుపుతూ మోదీని మ్యూజియానికి తీసుకెళ్లడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మ్యూజియం అమ్మాన్‌లోని రాస్ అల్ ఐన్ జిల్లాలో ఉంది. ఇది ఆ దేశంలోనే అతిపెద్ద మ్యూజియం. ఈ మ్యూజియంలో అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రక కళాఖండాలను ప్రదర్శిస్తారు.
