పాకిస్థాన్ గూఢచర్య నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై భారత వైమానిక దళాని కి చెందిన ఒక రిటైర్డ్ అధికారిని అసోం పోలీసులు అరెస్ట్ చేశారు.

తేజ్‌పూర్‌లోని పాటియా ప్రాంతానికి చెందిన కులేంద్ర శర్మ .. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కొంతకాలంగా కులేంద్ర శర్మపై నిఘా పెట్టిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పాకిస్థాన్ గూఢచర్య సంస్థతో సంబంధాలున్న వ్యక్తులతో టచ్‌లో ఉంటూ, వారికి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
