
న్యూ మాస్టర్‌మైండ్స్ జూనియర్ కాలేజ్, బడంగ్పేట్ లో ఘనంగా కామర్స్ ఒడిస్సీ–2025 పేరుతో కామర్స్ డే నిర్వహించబడింది,
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో వాణిజ్య,ఆర్థిక విజ్ఞానం పెంపొందించడానికి, ఆలోచనా శక్తికి ప్రేరణ కల్పించడానికి ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది,
విద్యార్థులను పలు బృందాలుగా విభజించి, కామర్స్,ఎకనామిక్స్,సివిక్స్ అంశాలపై అవగాహన కల్పించేలా ప్రదర్శనలు,చర్చలు,మాక్ అసెంబ్లీలు ఏర్పాటు చేశారు,
మాక్ పార్లమెంట్ & మాక్ అసెంబ్లీ – ప్రజాస్వామ్య విధానాలపై అనుభవాత్మక అవగాహన,
కామర్స్ క్విజ్లు – వాణిజ్య,ఆర్థిక అంశాలపై విజ్ఞాన పరీక్షలు,
ఎథిక్స్ వర్సెస్ బిజినెస్ – వ్యాపారంలో నైతికతపై చర్చలు,
వైర్లెస్ & క్యాష్‌లెస్ ఇండియా ప్రభావం – డిజిటల్ మార్పుల విశ్లేషణ,
క్రిప్టోకరెన్సీ ప్రభావం – డిజిటల్ కరెన్సీల భవిష్యత్,
ప్రపంచ వ్యాపార యుద్ధాల ప్రభావం – భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ప్రభావాలు,
జీఎస్టీ & చిన్న వ్యాపారాలు – పన్నుల విధానాల ప్రభావంపై అధ్యయనం,
కార్యక్రమానికి శ్రీ కార్వన్ లక్ష్మా రెడ్డి (ICWAI) ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు,
గౌరవ అతిథిగా శ్రీమతి త్రివేణి, తపస్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు,
చైర్మన్ డా. జగన్మోహన రావు, కార్యదర్శి డా. పాండు, కామర్స్ విభాగాధిపతి శ్రీధర్ రెడ్డి, ఇతర ప్రిన్సిపాళ్లు విద్యార్థులను ఉత్సాహపరిచారు,
విద్యార్థులు, బోధనా మరియు బోధనేతర సిబ్బంది భార్యంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,
మొత్తానికి, కామర్స్ ఒడిస్సీ–2025 విద్య, నాయకత్వ, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది.
