నూతన సంవత్సరం వేళ.. క్యాబ్ బుకింగ్లను తిరస్కరిస్తే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు తెలుపుతున్నారు.

హైదరాబాద్ సిటీ: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. క్యాబ్, ట్యాక్సీ, ఆటోరిక్షా ఆపరేటర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ఆయా వాహనాల డ్రైవర్లు యూనిఫాంలో ఉండడంతో పాటు అన్ని పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు యాప్లో రైడ్ కోసం బుకింగ్ చేసుకుంటే దాన్ని తిరస్కరించకూడదని, నిరాకరిస్తే ఈ-చలాన్ రూపంలో జరిమానా విధించబడుతుందని పేర్కొన్నారు.
