తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని నామినేషన్లు, ఓట్లు వేసేది లేదంటూ శుక్రవారం బజార్హత్నూర్ మండలంలో గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన కొత్తపల్లి ప్రజలు నిరసన తెలిపారు.

మూడవ విడుత ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ గిర్నూర్లోని 9వ వార్డు కొత్తపల్లి గ్రామస్తులెవరూ నామినేషన్లు వేయబోమని భిష్మించుకూర్చున్నారు. గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉన్నట్లే కానీ తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు.
