
జాగో భాగ్యనగర్ – చలో బాలాపూర్ నినాదంతో ప్రజల చైతన్యం,ధర్మం, భద్రత, స్థానికుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్మరక్షణ సభకు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీవాసులు, సీనియర్ సిటిజన్స్ దృఢమైన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా “ఇది వ్యక్తులపై కాదు – అక్రమాలపై పోరాటం, ఇది ద్వేషం కాదు – ధర్మ పరిరక్షణ, ఇది రాజకీయ స్వార్థం కాదు – హిందువుల భవిష్యత్తు కోసం ఉద్యమం” అనే సందేశంతో ప్రజలను చైతన్యపరిచారు. ప్రతి హిందువు ఈ ధర్మ ఉద్యమంలో భాగస్వామి కావాలనే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2 బీజేపీ అధ్యక్షులు తులసి ముకేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని ప్రజలను కలిసి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తున్న ధర్మరక్షణ సభకు హాజరుకావాలని ఆహ్వానించారు. కాలనీ అధ్యక్షులు, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్, హిందూ బంధువులు, కాలనీవాసులు ఈ సభకు తమ మద్దతును ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిద్ధాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మద్ది రాజశేఖర్ రెడ్డి, గౌరీ శంకర్, సీనియర్ నాయకులు కాశీరాం, జగన్, ముదిరాజ్, వేణు గోపాల్ రెడ్డి, రంగారెడ్డి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
