ప్రముఖ సినీనటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల : ప్రముఖ సినీనటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లతో కలిసి ఆలయానికి చేరుకున్న రజనీకాంత్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. బెల్లం, కలకండ, ధాన్యంతో స్వామివారికి తులాభారం సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు రజనీ కుటుంబానికి వేదాశీర్వచనం, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు
