ఖమ్మం కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వీరన్న బలవన్మరణం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఇంది నిదర్శనమని చెప్పారు.

‘కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనం.
