` న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలో వంతెన కుప్పకూలింది. దీంతో 32 మంది మృతి చెందారు.

కాంగోలోని లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్లో రాగి గని ఉంది. ఈ మైనింగ్ సైట్లో వందలమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో అది కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం ఇప్పటివరకు సుమారు 32 మంది చనిపోయారని మైనింగ్ ఏజెన్సీ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడి.
