కార్తీక మాసం పురస్కరించుకొని కొత్తగూడెం డిపో నుండి అన్నవరం పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారని విలేజ్ బస్ ఆఫీసర్ (విబీవో) ఇస్నాపల్లి శామ్యూల్ తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ నెల 26 ఆదివారం రాత్రి 9 గంటలకు పంచారామాలు, అన్నవరం బస్సులు బయలుదేరతాయని, అన్నవరంకు డీలక్స్ సర్వీసు పంచారామాలకు సూపర్ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
