ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అమరావతి : ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 25 వరకు ఉన్న జిల్లాల సంఖ్య 28కు చేరుకుంది . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ అధ్యక్షతన సోమవారం మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది .
కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లా ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించిన తుది గెజిట్ నోటిఫికేషన్ను ఈనెల 31న విడుదల చేయనున్నారు. అదేవిధంగా కొన్ని జిల్లాల పునర్వీభజన చేయనున్నామని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
