ఏకగ్రీవంతో డబ్బు భారం ఉండదులే అనుకుంటే, మరో రూ.20లక్షలు? పెట్టాల్సి వస్తుందని, బుద్ధి ఉండి ఎన్నికలలో పోటీ చేయవద్దని బావురమంటున్నారు.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి, రెండో విడతలో ఉపసంహరణ పూర్తయి ప్రచారం ప్రారంభం కాగా మూడో విడత నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. ఇదిలా ఉండగా మొదటి రెండు. విడతల్లో కొన్ని పంచాయతీలు ఎకగ్రీవాలయ్యాయి. పోటీ ఉన్న చోట సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అంతులేని హామీలతో పాటు, సాయంత్రం మందు, విందులతో పాటు, మహిళలకు చీర, సారెలను అందజేస్తున్నారు. అంతేకాక ఓటుకు, రూ.2 వేలు ఇస్తామని హామీ ఇస్తుండటంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
