
జగద్గిరిగుట్ట, డిసెంబర్ 12: (శ్రీరామ్ చక్రిన్యూస్)ఇటీవల ఆత్మహత్య చేసిన ఈశ్వరచారి కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం కుటుంబానికి నష్టపరిహారం చెక్ అందజేశారు.కార్యక్రమంలో బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ ‘సంవిధాన్ బచావో’ కమిటీ చైర్మన్ డా. వినయ్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, బిసి సంఘం నాయకులు గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఈశ్వరచారి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమైనదని, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని, సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని సూచించారు. బిసి రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరూ అడ్డుకావద్దని భరోసా ఇచ్చారు.మహేష్ కుమార్ గౌడ్ జగద్గిరిగుట్టలోని ఈశ్వరచారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. నష్టం పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వనున్నారు అని తెలిపారు. బిసి సమాజం రిజర్వేషన్ల సాధనలో కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆయన కోరారు.
