ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది.

అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్ తొక్కుతున్న తమ్ముడు ప్రదీప్(9) ప్రాణాలతో బయటపడగా సైకిల్ వెనుక కూర్చొన్న అన్న కిరణ్(11) బస్ టైర్ కింద పడి మృతి చెందాడు.
