రాజకీయ పార్టీలకతీతంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జెండాల నీడలోనే సాగుతున్నాయి. పార్టీల నాయకులు పార్టీ సానుభూతిపరులు, అనుచరులను పోటీల్లో నిలుపుతున్నారు.

చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రాజకీయ పార్టీలైతే ప్రోత్సహిస్తున్నాయి గానీ కరెన్సీకి గ్యారెంటీ ఇవ్వడం లేదు. రాజకీయాలంటే మక్కువ ఉన్న వారు ఏదో విధంగా డబ్బులు సమకూర్చుకుంటుండగా.. మరికొందరు నేతలపైనే భారం వేస్తున్నారు.
దీంతో రాజకీయ ప్రాబల్యం కోసం నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత భుజాలపై పడటంతో ఎన్నికల ఖర్చు కోసం వెదుకులాట మొదలుపెట్టారు. అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. కొందరు స్థిరాస్తులను అమ్మకాలకు పెడుతున్నారు. అశ్వారావుపేట మండలంలో ఒక సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం 80 సెంట్ల భూమిని అమ్మకానికి పెట్టాడు.
