తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు

హనుమకొండ, డిసెంబరు13 : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పీఆర్వో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ ఎంపీనని… తాను కూడా కొన్ని పోస్టులను చూశానని ప్రస్తావించారు. అవగాహన లేకుండా కొంతమంది తనపై కుట్ర పూరితంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
