యువకుడు గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న పక్కాసమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేపట్టారు. అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్పూర్లో గంజాయి మొక్కలు కలకలం సృష్టించాయి. ఓ యువకుడు కిస్మత్‌పూర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. సదరు యువకుడు గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న పక్కాసమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేపట్టారు.
