తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఐనవోలు( హనుమకొండ) : తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ఆర్చక బృందం ఆలయంలో తెల్లావారుజాము నుంచే స్వామి వారికి మొలుకోలుపు, నూతన వస్త్రాలంకరణం, పుణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మహానివేదనలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
