
డిసెంబర్ 18( శ్రీరామ్ చక్రి న్యూస్) హస్తినాపురం డివిజన్ భూపేష్ గుప్తా నగర్‌లోని బస్తీ దావఖానా సమీప కాలనీలో తీవ్ర దుర్వాసనతో కూడిన మురికి నీరు ప్రవహిస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సెకండరీ కార్ప్ కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ పాయింట్‌తో పాటు బాంబే కాలనీ నుంచి వచ్చే డ్రైనేజీ నీరు అధికంగా చేరడంతో ఈ సమస్య తలెత్తినట్లు స్థానికులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సెకండరీ కార్ప్ కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ పాయింట్‌తో పాటు సంబంధించిన వాహనాల నుంచి మురికి నీరు రోడ్డుపైకి వచ్చి అక్కడి నుంచి కాలనీలోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి నీటి దుర్వాసనను తట్టుకోలేకపోతున్నామని, దీని వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సెకండరీ కార్ప్ కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ పాయింట్‌తో పాటు
వద్ద ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
ఈ సందర్భంగా నారగోని శ్రీనివాస్ యాదవ్ కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురికి నీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సెకండరీ కార్ప్ కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ పాయింట్‌తో పాటు, బాంబే కాలనీ, నందనవనం,నుంచి వచ్చే మురికి నీటిని వెంటనే మాన్యువల్ సమస్యను పరిష్కరించాలి సంబంధిత అధికారులను స్పందించే అవసరం ఉందని ఆయన తెలిపారు.
అలాగే, సమీపంలోని బస్తీ దావఖానాకు చికిత్స కోసం వచ్చే రోగులు, రోగం నయం చేసుకోవడం ఏమో కానీ కొత్త వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే పరిస్థితులను సహించబోమని ఆయన హెచ్చరించారు.
