భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్సెల్, తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం నవంబర్ 28–29 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్సెల్, తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం నవంబర్ 28–29 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించడం, అవసరమైతే నిరంతర చికిత్సకు అనుసంధానం చేయడం, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశం అని కలెక్టర్ వెల్లడించారు.
