నెలనెలా వసూళ్లతో సంబంధం లేకుండా కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణల నుంచి గుడ్విల్ పేరిట ఆబ్కారీ శాఖ వసూళ్ల దందా ప్రారంభించింది

ఒక్కో షాపు నుంచి రూ.50వేలు వసూలు చేయగా ఈ సారి అమాంతం పెంచి రూ.1.50 లక్షలకు పెంచి పదిహేను రోజుల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలోని 93 దుకాణాల నుంచి గుడ్విల్ కింద కోటిన్నర వసూలు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ఆ శాఖకు చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఓ కానిస్టేబుళ్లతో వసూళ్లు ప్రారంభించారని, ఒకవేళ ఎవరైనా కాదంటే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారట. ఇప్పటికే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో వసూళ్లు పూర్తి కాగా తుంగతుర్తిలో ఓ ప్రజాప్రతినిధి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉండగా సూర్యాపేటల్లో మూడు రోజుల క్రితమే ప్రారంభమైనట్లు సమాచారం. గత బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన మద్యం దుకాణాల గడువు ముగియడంతో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది.
