మూగజీవాలకు రోగం వస్తే ఎవరికీ చెప్పుకోలేవు. అడ్డంపడితే తప్ప వాటికి జబ్బు చేసిన సంగతి యజమానులకు తెలియదు. అప్పటికప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి.

మూగజీవాలకు రోగం వస్తే ఎవరికీ చెప్పుకోలేవు. అడ్డంపడితే తప్ప వాటికి జబ్బు చేసిన సంగతి యజమానులకు తెలియదు. అప్పటికప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఉదయం పదిగంటలు దాటితే తప్ప ఆసుపత్రులకు డాక్టర్లు రారు. తీరా సర్కారు పశువైద్యశాలకు వెళ్తే అక్కడ మందులు ఉండడం లేదు. దీంతో పశువుల యజమానులు సొంత డబ్బులతో బయట మందులు కొనుక్కొని వచ్చి మరీ వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి. జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో ఇదే పరిస్థితి. ఆసుపత్రులు, సబ్సెంటర్లలో మందులు లేకపోవడంతో వైద్యులు, వెటర్నరీ అసిస్టెంట్లు పశువులు యజమానులకు బయటకు చీటీలు రాస్తున్నారు. భద్రాచలం, ఇల్లెందుల్లో మరీ దారుణం. ఏడీ స్థాయి ఆసుపత్రులు ఉన్నా వైద్యులు లేడు. సరైన వైద్యం
