
డిసెంబర్ 28 (శ్రీరామ్ చక్రి న్యూస్)ఈరోజు అనగా 28.12.2025 న ఉదయం మీర్పేట్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, వైన్స్‌ల వద్ద మరియు పార్కుల వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడిని కోపులురి శ్రీను (39), తండ్రి వెంకటేశ్వర్లు, వృత్తి మేస్త్రి, నివాసం యమజల్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా గా గుర్తించారు. అతని వద్ద నుంచి మొత్తం 17 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

