కందుకూరు, అక్టోబర్ 16 (శ్రీరామ్ చక్రీ న్యూస్):

మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని కొత్తగూడ ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటు చేసిన సెవెన్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంగళవారం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఈ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పెద్దరామయ్య, కందుకూరు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, గంగపురం లక్ష్మీ నరసింహరెడ్డి, దేవర్శెట్టి చంద్రశేఖర్, సురసాన్ని రాజశేఖర్ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఇందిరా దేవేందర్, గుయ్యాని సామయ్య, యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, దీక్షిత్ రెడ్డి, సామ మహేందర్ రెడ్డి, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ సామ ప్రకాష్ రెడ్డి, పొట్టి ఆనంద్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇంతకుముందు సర్పంచులుగా పనిచేసిన కాసుల రామకృష్ణారెడ్డి, బ్రాహ్మణ పెళ్లి జ్యోతి చంద్రశేఖర్, కాకి ఇందిరా, దశరథ ముదిరాజ్, శ్రీహరి ముదిరాజ్, పరం జ్యోతి, డేరంగుల జంగయ్య, అలాగే మాజీ ఎంపీటీసీలు కాకి రాములు ముదిరాజ్, గుండాల సురేష్, పాపగండ్ల వెంకటేష్, కుమ్మరి నరేష్, గోరింకల రామకృష్ణ, కాకి రవీందర్, నల్లి శ్రీధర్, జక్కుల నరసింహ పాల్గొన్నారు.
