జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు, అభ్యర్థుల సంఖ్యలో ఎట్టకేలకు గురువారం స్పష్టత వచ్చింది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు, అభ్యర్థుల సంఖ్యలో ఎట్టకేలకు గురువారం స్పష్టత వచ్చింది. కనీసం 150 మంది పోటీలో ఉండే అవకాశం ఉండే అవకాశం ఉందని భావించగా.. ఆ సంఖ్య 81కి తగ్గింది. మంగళవారంతో ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 211 మంది 321 నామినేషన్ల సెట్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన చేపట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ 130 అభ్యర్థులకు చెందిన 186 సెట్ల నామినేషన్లు తిరస్కరించారు. ఇక 81 మందికి చెందిన 153 నామినేషన్లు ఆమోదం పొందాయి.
