బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 9వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

చెన్నై:ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇపుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది క్రమంగా మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా రానున్న రెండు రోజుల పాటు కోస్తాతీర జిల్లాల్లో కొన్ని చోట్ల, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
