మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

నాగర్ కర్నూల్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని 12, 13 వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలు బొడ్రాయి, పోచమ్మ, ఈదమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
